కరోనా వైరస్ నియంత్రణలో ఏపీ సీఎం జగన్ వ్యవహరిస్తున్న తీరును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తప్పుబట్టారు. కరోనాతో రాష్ట్ర ప్రజలు అల్లాడుతోంటే సీఎం జగన్కు ఏ మాత్రం పట్టడంలేదని విమర్శించారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల సీఎంలు ప్రతిపక్షాలను కలుపుకుని కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారని గుర్తు చేసిన రామకృష్ణ.. కనీసం వాళ్లను చూసైనా జగన్ అఖిలపక్ష సమావేశం నిర్వహించలేరా అని ప్రశ్నించారు. కరోనా విపత్తును పక్కనపెట్టి, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టడమే జగన్ పనిగా పెట్టుకున్నారని రామకృష్ణ దుయ్యబట్టారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించేదే నిజమైతే మంత్రి అప్పలరాజుపై కూడా అవే కేసులు పెట్టగలరా అని ప్రభుత్వాన్ని రామకృష్ణ నిలదీశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement