ఒంగోలు, నెల్లూరు మేలు రకానికి చెందిన ఆవులు బాగా ప్రసిద్ధి. ఈ జాతికి చెందిన ఆవులకు బాగా డిమాండ్ కూడా ఉంటుంది. ఇటీవల బ్రెజిల్‌లో జరిగిన ఓ వేలంలో నెల్లూరు జాతికి చెందిన ఓ ఆవు ఏకంగా రూ. 40 కోట్లు పలకింది. ఇప్పుడు ఈ మేలురకపు ఆవులు ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి.
దీంతో భారతదేశానికి చెందిన ఈ మేలురకపు జాతి ఆవు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవుగా మారింది. వయాటినా-19 ఎఫ్ఐవీ మారా ఇమోవిస్ అని పిలవబడే నెల్లూరు జాతికి చెందిన ఆవు ఏకంగా 4.8 మిలియన్ అమెరికన్ డాలర్లకు (సుమారు రూ. 40 కోట్లు) అమ్ముడుపోయింది. ఇక ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన ఈ మేలురకపు ఆవులను 1868లోనే బ్రెజిల్‌కు తరలించడం జరిగింది. ఆ తర్వాత ఈ రకపు జాతి ఆవులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి.
ఇక ఈ జాతికి చెందిన ఆవులు ఒక్క బ్రెజిల్ దేశంలోనే 16 మిలియన్ల వరకు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. తెలుపు రంగులో ఉండి, చూడటానికి బలిష్టంగా కనిపించే ఈ మేలురకపు ఆవులు వేడి ప్రదేశాలలోనూ ఇమిడిపోగలవు. అంతేగాక వీటిలో వ్యాధి నిరోధక శక్తి కూడా అధికంగానే ఉంటుంది. కాగా, ఈ జాతి ఆవు శాస్త్రీయ నామం వచ్చేసి బోస్ ఇండికస్ అని పిలవడం జరుగుతుంది.