కరోనాను ప్రపంచం జయించాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని అన్ని దేశాలు బలంగా నమ్ముతున్నాయి..ఈ నేపథ్యంలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రభుత్వాలు దృష్టి పెడుతున్నాయి.. చాలా దేశాల్లో వ్యాక్సినేషన్ వేగంగా అమలు చేస్తున్నారు. ఇండియాలో వేగంగా వ్యాక్సిన్ అందిస్తున్నారు. సెకండ్ వేవ్ సమయంలో కేసులు, మరణాలు ఏవిధంగా ఉన్నాయో చెప్పక్కర్లేదు.అయితే వ్యాక్సిన్ వేసుకున్న కూడా కొంత మందికి కరోనా సోకుతుందన్న వార్తల నేపథ్యంలో తాజా అధ్యయనం ఊరటనిస్తోంది. ఇండియాలో ప్రస్తుతం మూడు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒకటి. సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్నది. కరోనా మహమ్మారిపై కోవీషీల్డ్ ఎంతమేరకు రక్షణ కల్పిస్తుంది అనే దానిపై ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ జరిపిన అధ్యయన వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కోవిషీల్డ్ 93 శాతం రక్షణ కల్పిస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. అదే విధంగా మరణాలు సంభవించే ప్రమాదాన్ని 98శాతం తగ్గిస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలియజేసింది. అయితే, కరోనా ఇన్‌ఫెక్షన్ సోకకుండా వ్యాక్సిన్లు 100 శాతం గ్యారెంటీ ఇవ్వలేదని నీతీ ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి : దేశంలోనే తొలిసారిగా ‘స్టోలెన్ ప్రాపర్టీ రిలీజ్ మేళా’