Saturday, November 23, 2024

స్లాట్లన్నీ ఫుల్..మే 16 వరకూ నిల్.. కొవిన్ వెబ్ సైట్ !

రేపటి నుంచి 18 సంవత్సరాలు దాటిన వారందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభకానుంది. కొవిన్ వెబ్ సైట్, ఆరోగ్య సేతు యాప్ ద్వారా ఈ రిజిస్ట్రేషన్స్ అన్ని జరిగాయి. ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ చేసుకునేవారికి సైట్ ఓపెన్ చేస్తే.. 16వ తేదీ వరకూ స్లాట్లు ఖాళీ లేవని కొవిన్ చూపుతోంది. వాస్తవానికి కొవిన్ యాప్ లో పిన్ కోడ్ నంబర్ ఆధారంగా వ్యాక్సిన్ కేంద్రాలు కనిపిస్తాయి. ఎన్నో నగరాల పరిధిలో పిన్ కోడ్లు టైప్ చేస్తే, తదుపరి రెండు వారాల వరకూ స్లాట్ లేదన్న సమాచారం కనిపిస్తోంది.

బుధవారం నుంచి రిజిస్ట్రేషన్ లు చేసుకోవచ్చని కేంద్రం ప్రకటించినా, సాయంత్రం నాలుగు గంటల తరువాతనే వెబ్ సైట్ తెరచుకుంది. ఒక్కసారిగా లక్షలాది మంది వెబ్ సైట్ ను తెరవడంతో అవాంతరాలు ఏర్పడ్డాయి. ఆపై రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా, గంటల వ్యవధిలో కోటి మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇక, గురువారం నాడు స్లాట్లు ఖాళీ లేవన్న సమాచారం మాత్రమే వెబ్ సైట్ లో కనిపించింది. ప్రస్తుతం 45 ఏళ్లు పైబడిన వారికి టీకాలను ఇస్తున్న సంగతి తెలిసిందే. వారికి ఇవ్వడానికే సరిపడినంత టీకాలు లేవు. ఈ పరిస్థితుల్లో 18 ఏళ్లు దాటి నారికి ఎంతమాత్రం టీకాలు వేస్తారన్న విషయమై ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి వ్యాక్సిన్ ఎలా ఇవ్వాలన్న విషయమై సందిగ్ధత నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement