దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ నిదానంగా సాగుతున్నది. ఇప్పటి వరకు దేశంలో 18 కోట్ల 58 లక్షల మంది టీకాలు వేయించుకున్నారు. 18,58,09,302 మంది టీకాలతో లబ్ధి పొందినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఇవాళ చెప్పింది. గత 24 గంటల్లో 13,12,155 మంది టీకాలు వేశారు. ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్.. తొమ్మిది రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులతో మీటింగ్ నిర్వహించనున్నారు. బెంగాల్, అస్సాం, మణిపూర్, మేఘాలయా, మిజోరం, నాగాల్యాండ్, త్రిపుర, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ మంత్రులతో ఆయన మాట్లాడుతారు. కరోనా నియంత్రణ కోసం హెచ్చు స్థాయిలో టెస్టింగ్ నిర్వహించాలని ప్రధాని మోదీ అన్నారు. స్థానికంగా కంటేన్మెంట్ జోన్లను తయారు చేయాలని, రోగులకు సరైన సమాచారం ఇవ్వాలని నిన్న ప్రధాని పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement