Tuesday, November 26, 2024

COVID UPDATE : క‌రోనా ప్ర‌మాద ఘంటిక‌లు.. ఒక్క‌రోజే 12 వేల కేసులు

దేశంలో క‌రోనా కేసులు రోజురోజుకు పెరుగుత‌న్నాయి. గ‌త కొంత‌కాలంగా త‌గ్గుతూ వ‌చ్చిన కేసులు మ‌ళ్లీ విజృంభిస్తున్నాయి. మహమ్మారి విజృంభిస్తుండటంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య రెట్టింప‌వుతుంది. గత నాలుగు రోజులుగా 8 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా, నేడు ఆ సంఖ్య 12 వేలు దాటింది. కొత్తగా 12,213 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఫిబ్రవరి 26 తర్వాత అంటే గత 109 రోజుల్లో ఒకేరోజు 10 వేలకుపైగా కేసులు రికార్డవడం ఇదే మొదటిసారి. కాగా, బుధవారం నాటికంటే ఇది 38.4 శాతం అధికం. యాక్టివ్‌ కేసులు కూడా 60 వేలకు చేరువయ్యాయి.

రోజువారీ కేసులు ఒక్కసారిగా పెరుగుతుండటంతో మొత్త బాధితులు 4,32,57,730కి చేరారు. ఇందులో 4,26,74,712 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,803 మంది మరణించారు. మరో 58,215 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 11 మంది కరోనాతో మృతిచెందగా, 7624 మంది డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

దేశంలో ఈ దఫా కూడా మహారాష్ట్ర కరోనా కేంద్రంగా మారింది. రాష్ట్రంలో ప్రతిరోజూ వేల సంఖ్యలో బాధితులు నమోదవుతున్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా 4,024 కేసులు మరఠ్వాడాలోనే ఉన్నాయి. ఇక కేరళలో 3488, ఢిల్లీలో 1378, కర్ణాటకలో 648, హర్యానాలో 596, తమిళనాడులో 476 చొప్పున మోదయ్యాయి.

కాగా, రోజువారీ పాజిటివిటీ రేటు 2.35 శాతానికి చేరుకున్నది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.13 శాతానికి చేరాయి. రికరీరేటు 98.65 శాతంగా, మరణాలు 1.21 శాతంగా ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,95,67,37,014 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement