Friday, November 22, 2024

మళ్లీ కొవిడ్‌ పాజిటివ్​ కేసులు.. కొత్త కేసులు 524, ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 3,618

దేశంలో కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు మళ్లి పెరుగుతున్నాయి. 113 రోజుల తర్వాత గడిచిన 24 గంటలల్లో దేశంలో 524 కొత్త కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రత్వ శాఖ పేర్కొంది. గతేడాది నవంబర్‌లో మాత్రమే ఒకే రోజులో 500 పైగా కొవిడ్‌ కేసులు నమోదు అయిన తర్వాత ఈ రోజు మళ్లిd ఆ మార్క్‌ను దాటింది. దేశంలోని యాక్టివ్‌ కేసులు 3,618కి పెరిగిందని హెల్త్‌ బులెటిన్‌ పేర్కొంది. కేరళలో ఒక మరణంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,781కి పెరిగింది. దేశంలో ఇప్పటి వరకు మొత్తం కొవిడ్‌ కేసులు 4,46,90,492.

జాతీయ కొవిడ్‌ రికవరీ రేటు 98.80 శాతంగా ఉండగా, వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,56,093కి పెరిగింది. కేసు మరణాల రేటు 1.19 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా వ్యాక్సికేషన్‌ డ్రైవ్‌ కింద ఇప్పటి వరకు 220 కోట్ల 64 లక్షల డోస్‌ల కొవిడ్‌ వ్యాక్సిన్‌ను అందించినట్లు డేటా చూపుతోంది. కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్‌-19 పాజిటివిటీ రేటు క్రమంగా పెరగడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. దీనిని వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

- Advertisement -

ఇన్‌ఫ్లుయెంజా లాంటి అనారోగ్యం లేదా తీవ్రమైన ధీర్ఘకాలిక శ్వాససంబంధిత ఇన్‌ఫెక్షన్‌ కేసులుగా కనిపించే శ్వాసకోశ వ్యాధికారక సమగ్ర నిఘా కోసం కార్యాచరణ మార్గదర్శకాలను అనుసరించాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో తెలిపారు. మందులు, వైద్య ఆక్సిజన్‌ లభ్యత, కొవిడ్‌-19, ఎన్‌ఫ్లుయెంజాకు వ్యతిరేకంగా టీకా కవరేజ్‌ వంటి ఆస్పత్రి సంసిద్ధత స్టాక్‌ను తీసుకోవాలని భూషణ్‌ అభ్యర్థించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement