Monday, November 18, 2024

అందరిలో స్ఫూర్తి నింపిన యువతి.. ఇక లేదు!

కొవిడ్‌తో పోరాడుతూ ఆస్పత్రి బెడ్‌ పై ఉన్నా కూడా ఎంతో చ‌లాకీగా ల‌వ్ యూ జింద‌గీ పాట వింటూ అందరి దృష్టిని ఆకర్షించిన యువతి కన్నుమూసింది. ఈనెల 8న సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ అయ్యింది.  ఓ యువతి చేతికి సిలైన్, ముక్కుకు ఆక్సిజన్ పెట్టుకొని అత్యవసర బెడ్ మీద చికిత్స పొందుతూ కనిపించింది.  ఐసీయూలో చేరాల్సి ఉన్నా బెడ్ దొరక్కపోవడంతో అత్యవసర వార్డులో ఆమెకు చికిత్స అందించారు వైద్యులు. సాధారణంగా ఈ పరిస్థితుల్లో ఉన్న రోజులు డీలాపడిపోయి మానసికంగా కృంగిపోయి ఉంటారు.  కానీ, ఆ యువతి మాత్రం అలా కాదు.  ప్రాణాలు పోయే పరిస్థితులు ఉన్నాయని తెలిసి కూడా మానసికంగా  ధైర్యంగా ఉన్నది.  హే జిందగీ అనే సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేసింది.  ఎందరికో సోషల్ మీడియా ద్వారా స్ఫూర్తి నింపిన ఆ ధీర వనిత గురువారం రోజున చికిత్స పొందుతూ మరణించినట్టు ఆమెకు వైద్యం అందించిన డాక్టర్ మోనిత ట్విట్టర్ ద్వారా తెలిపారు.

కొవిడ్‌తో పోరాడుతున్న ఆ యువ‌తి వ‌యసు కేవ‌లం 30 ఏళ్ల‌ని, ఆమెకు ఓ చిన్నారి కూడా ఇంటి వద్ద ఎదురు చూస్తోందని గ‌తంలో మోనికా ఓ ట్వీట్‌లో తెలిపింది. అప్పుడు ఆమెకు ఐసీయూ బెడ్ దొర‌క‌లేదని, ఆ త‌ర్వాత ఈ నెల 10న ఆమెకు ఐసీయూ బెడ్ దొరికినా.. ప‌రిస్థితి క్షీణించిందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement