దేశంలో కరోనా భయం ప్రజలను వెంటాడుతుంది. మొన్నటి దాకా చైనాలో కరోనా కేసుల సంఖ్య లక్షల్లో నమోదవ్వడంతో ప్రజలు భయాందోళనకు గరయ్యారు. అయితే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఇంకా భారత్ లో కరోనా అదుపులోనే ఉందని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. తాజాగా భారత్ లో కరోనా కేసులు స్పల్పంగా పెరిగాయి. గత కొంతకాలంగా కరోనా కేసుల సంఖ్య రోజుకు 200 వందల లోపే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,93,051 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 188 కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,79,319కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,554 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24గంటల్లో ముగ్గురు మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య.. 5,30,710కి చేరింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement