Friday, November 22, 2024

5 నెలల గరిష్టానికి కొవిడ్‌ కేసులు.. ఒకేరోజు 1980 కొత్త కేసులు

దేశంలో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. దాదాపు 149 రోజుల తర్వాత దేశంలో కొవిడ్‌ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కేంద్ర ఆరోగ్యశాఖ నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా కొత్తగా 1890 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 9433కి చేరింది. ఇంతకు ముందు గతేడాది అక్టోబర్‌ 28న ఒకే రోజులో అత్యధికంగా 2,208 మందికి కొవిడ్‌ సోకింది. మరో వైపు వైరస్‌ కారణంగా మరో ఏడుగురు మృతి చెందారు.

కేరళలో ముగ్గురు, మహారాష్ట్రలో ఇద్దరు, గుజరాత్‌లో ఒకరు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,831కి చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.56శాతానికి చేరగా.. వారపు పాజిటివిటీ రేటు 1.29శాతానికి చేరింది. ఇప్పటి వరకు 4,47,00,147 మందికి వైరస్‌ సోకింది. రికవరీ రేటు 98.79శాతంగా ఉన్నది. ఇప్పటివరకు 220.65 కోట్ల కరోనా వ్యాక్సిన్‌లు వేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement