ప్రభ న్యూస్, హైదరాబాద్: కొవిడ్ మహమ్మారిని నిర్మూలించే వ్యాక్సినేషన్ హబ్‌గా పేరుగాంచిన హైదరాబాద్‌లో మళ్లి కొవిడ్ కేసుల పెరుగుదల కలకలం సృష్టి స్తోంది. ఇటీవలి వరకు అంటే గత మే నెల వరకు సైతం పదుల సంఖ్యలో నమోదైన కేసులు.. జూన్ నెలలో విపరీతంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జూన్ నెల 13న సైతం 75 కేసులు నమోదు కాగా.. తర్వాత కేసులు విజృంభిస్తుండటం గమ నార్హం.
గత కొవిడ్ మహమ్మారి విజృంభణ మొదటి, రెండో దశల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 75శాతం కేసుల నమోదైన అంశం మళ్లి పునరావృతమ వుతోంది. ఈ నెల 14న 164, 15న 132, 16న 188, 17న 172, 18న 157 కేసులు నమోదయ్యాయి. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న వర్షాకాల సీజన్‌లో పరిస్థి తులు ఎలా ఉంటాయోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.