భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మొన్నటి దాకా అదుపులోనే ఉన్నా.. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే దేశంలో వరుసగా రెండో రోజూ నాలుగు వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఆదివారం 4270 మందికి పాజిటివ్ నిర్ధారణకాగా, నేడు మరో 4518 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసులు 43,181,335కు చేరాయి. ఇందులో 4,26,30,852 మంది బాధితులు కోలుకోగా, ఇప్పటివరకు 5,24,701 మంది మృతిచెందారు. ఇంకా 25,782 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 9 మంది మరణించగా, 2,779 మంది డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
మొత్తం కేసుల్లో 0.06 కేసులు యాక్టివ్గా ఉండగా, రికరీ రేటు 98.73 శాతం, మరణాల రేటు 1.22 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,94,12,87,000 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని, ఆదివారం ఒక్కరోజే 2,57,187 మందికి వ్యాక్సిన్ ఇచ్చామని పేర్కొన్నది.