కరోనా వైరస్‌కు ఇప్పటి వరకు చికిత్స అంటే వ్యాక్సిన్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం కరోనా పేషెంట్లకు ఆస్పత్రుల్లో రెమిడిసివిర్‌తోనే చికిత్స అందిస్తున్నారు. దీనికి 100 శాతం ఫలితాలు రాకపోవడంతో వైద్యులు ప్రత్నామ్నాయం కోసం వేచి చూస్తున్నారు. ఈ సమయంలో వారికి ఉపశమనం కలిగించేలా మీడియాలో వార్తలు వచ్చాయి. త్వరలోనే కరోనా చికిత్సకు టాబ్లెట్లు వచ్చేస్తున్నట్లు తెలుస్తోంది.
రిడ్జిబ్యాక్ బయోథెరప్యూటిక్, మెర్స్క్ అండ్‌కో సంయుక్తంగా అభివృద్ధి చేసిన మోల్నుపిరావిర్ ఔషధంపై ఇప్పటివరకు చేసిన ప్రయోగాలు సానుకూల ఫలితాలను ఇచ్చాయి. ప్రస్తుతానికి ఈ ప్రయోగాలు మిడిల్ ఫేజ్‌లో ఉన్నట్లు తెలుస్తున్నాయి. ఐదురోజుల పాటు ఈ టాబ్లెట్లు వేసుకుంటే వైరస్ తగ్గిపోతుందని రిడ్జిబ్యాక్ వెల్లడించింది. ప్రస్తుతం పరిస్థితి ఆశాజనకంగా ఉందని, కానీ మెల్నుపిరావిర్ టాబ్లెట్ నూరుశాతం ఫలితాలు ఇస్తుందో లేదో ఇప్పుడే చెప్పలేమని, క్లినికల్ ఉపయోగాలు ఉంటాయని నిరూపించడమే తమ కర్తవ్యమని అమెరికాకు చెందిన ఓ ప్రముఖ వైద్యుడు వెల్లడించారు.
కాగా గతంలో ఫ్లూ జ్వరాలు బాగా ప్రబలినప్పుడు టామీ ఫ్లూ పేరుతో దానికోసమే ప్రత్యేక ఔషధం తీసుకువచ్చారు. అది అమోఘమైన ఫలితాలను ఇచ్చింది. ఇప్పుడు కరోనాపై మోల్నుపిరావిర్ కూడా అదే రీతిలో ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. మనిషి దేహంలో ప్రవేశించిన కరనా వైరస్ తిరిగి ఉత్పత్తి కాకుండా మోల్నుపిరావిర్ అడ్డుకుంటుంది. తద్వారా శరీరంలో వైరస్ వ్యాప్తిని తగ్గిస్తుంది. ఇది త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.