Saturday, November 16, 2024

డెల్టా, బీటా వేరియంట్ ఆట కట్టిస్తున్న కొవాగ్జిన్​!..

దేశంలో సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండడానికి కారణమైన డెల్టా వేరియంట్ పై భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ బాగా పనిచేస్తోందని తాజా అధ్యయనంలో తేలింది. పూణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, భారత వైద్య పరిశోధన మండలి, భారత్ బయోటెక్ లు కలిసి ఈ అధ్యయనం చేశాయి. డెల్టా వేరియంట్ (బీ.1.617.2)తో పాటు బీటా వేరియంట్ (బీ.1.351)నూ సమర్థంగా ఎదుర్కొంటోందని అధ్యయనంలో తేలింది. కరోనా నుంచి కోలుకున్న 20 మంది, కొవాగ్జిన్ రెండు డోసులు తీసుకున్న 17 మందిపై అధ్యయనం చేశారు. ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరాం భార్గవ కూడా అధ్యయనంలో పాల్గొన్నారు. రెండు వేరియంట్లనూ ఎదుర్కొనే ప్రతిరక్షకాలు ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతున్నట్టు గుర్తించారు. అయితే, రెండు రోజుల క్రితం కరోనా వైరస్ వ్యాక్సిన్ ఇండ్యూస్డ్ యాంటీ బాడీ టైటర్ (కొవాట్) చేసిన అధ్యయనంలో కొవాగ్జిన్ కన్నా కొవిషీల్డ్ తోనే మంచి యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతున్నాయని తేల్చిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement