కొవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఫిలిప్పీన్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే డబ్ల్యూహెచ్‌వో అనుమతి కోసం కొవాగ్జిన్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. బుధవారమే ప్రపంచ ఆరోగ్య సంస్థతో సమావేశం కూడా నిర్వహించింది. మూడో దశ ట్రయల్స్‌లో 77 శాతం సమర్థంగా పని చేసినట్లు రిపోర్ట్ కూడా సమర్పించింది. ఈ నేపథ్యంలో శుక్రవారమే తాము అనుమతి ఇచ్చినట్లు ఫిలిప్పీన్స్ ఫుడ్ అండ్ డ్రగ్ ఏజెన్సీ వెల్లడించింది. అవసరమైన అన్ని పత్రాలను సమర్పించడంతో కొవాగ్జిన్‌కు పూర్తిస్థాయి ఎమర్జెన్సీ వినియోగానికి అనుమతి ఇచ్చినట్లు సింగపూర్ లోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ రొలాండో ఎన్‌రిక్ డోమింగో చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement