బయోటెక్ ఉత్పత్తి చేసిన దేశీయ కొవిడ్ టీకా కొవాగ్జిన్ రెండు డోసులు తీసుకున్న వారికి కరోనా వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని పలు ఆస్పత్రులకు చెందిన వైద్యనిపుణులు నిర్వహించిన అధ్యయనంలో స్పష్టమైంది. కొవాగ్జిన్ రెండు డోసులు తీసుకున్న వారి విషయంలో బ్రేక్‌త్రూ-ఇన్ఫెక్షన్ కేవలం 2.2శాతంగా ఉందని తేలింది. అదేసమయంలో.. సీరం ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి అయిన కొవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్న వారిలో ఈ ఇన్ఫెక్షన్ రేటు 5.5శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. కొవిషీల్డ్ ద్వారా యాంటీబాడీలు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నా బ్రేక్‌త్రూ-ఇన్ఫెక్షన్ల విషయంలో కొవాగ్జిన్ సమర్థంగా పనిచేస్తోంది. కొవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్న వారి రక్తంలో ప్రతి మిల్లీలీటరుకు 127 అబ్జార్బన్స్ యూనిట్స్(ఏయూ) మేరకు యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయని, కొవాగ్జిన్ విషయంలో 53 ఏయూగా ఉందని చెప్పారు
అహ్మదాబాద్‌లోని విజయ్‌రత్న డయాబెటిస్ సెంటర్, కోల్‌కతాలోని జీడీ ఆస్పత్రి, ధన్‌బాద్‌లోని డయాబెటిస్, గుండె పరిశోధన కేంద్రం, మహాత్మాగాంధీ వైద్య కళాశాల(జైపూర్) వైద్యులు నిర్వహించి న ఈ అధ్యయన పత్రాలు మెడ్‌ఆర్‌ఎక్స్‌ఐవీలో ప్రచురి తం కావాల్సి ఉంది. టీకా రెండు డోసులు తీసుకున్న 515 మంది(305 మంది పురుషులు, 210 మంది స్త్రీలు) హెల్త్‌కేర్ వర్కర్లపై ఈ అధ్యయనం కొనసాగింది.