Tuesday, November 26, 2024

విదేశాల నుంచి కొవాగ్జిన్ బుకింగ్స్..

ప్ర‌భ‌న్యూస్ : ప్రముఖ ఫార్మాసంస్థ భార‌త్ బ‌యోటెక్ అభివృద్ధి చేసి, త‌యారు చేసిన కొవాగ్జిన్ టీకాల‌ను విదేశాల‌ ఎగుమ‌తులును ప్రారంభించింది. గ‌త ఏడాది క‌రోనావైర‌స్ ప్ర‌పంచ‌దేశాల‌ను గ‌డ‌గ‌డ‌లాడించిన విష‌యం తెలిసిందే. వైర‌స్ వ్యాప్తి క‌ట్ట‌డికి ప‌లు దేశాలు వివిధ ర‌కాల మందులు, టీకాలు అభివృద్ధి చేశాయి. అయితే భార‌త్‌కు చెందిన భార‌త్ బయోటెక్ సంస్థ తీసుకొచ్చిన కొవాగ్జిన్‌కు దేశీయంగా, అంత‌ర్జాతీయంగా మంచి గుర్తింపు ల‌భించింది. వైర‌స్ క‌ట్ట‌డిలో 90శాతం మేర ప‌నిచేస్తుంద‌ని వైద్య‌నిపుణుల ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డైంది.

ఈ నేప‌థ్యంలో ప‌లు దేశాలు కొవాగ్జిన్ టీకాల కోసం భార‌త్ బ‌యోటెక్‌కు ఆర్డ‌ర్లు ఇచ్చాయి. అయితే దేశీయంగా త‌యారైన క‌రోనా వ్యాక్సిన్లుపై కేంద్ర ప్ర‌భుత్వం నిషేధం విధించింది. తొలుత దేశ ప్ర‌జ‌లంద‌రికీ అందించిన త‌ర్వాతే ఎగుమ‌తులంటూ పేర్కొంది. దీంతో వివిధ దేశాల నుంచి అందుకున్న ఆర్డ‌ర్లుకు టీకాలు ఆయా ఫార్మా సంస్థ‌లు స‌ర‌ఫ‌రా చేయ‌లేక‌పోయాయి. తాజాగా టీకాల ఎగుమ‌తిపై కేంద్రం గ్రీన్‌సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో కొవాగ్జిన్ టీకాల‌ను ఎగుమతుల‌ను ప్రారంభించిన‌ట్లు భార‌త్ బ‌యోటెక్ సంస్థ వెల్ల‌డించింది. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ లో ట్వీట్ చేసింది. రాబోయే రోజుల్లో ఎగుమ‌తుల‌ను మ‌రింత పెంచుతామ‌ని పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement