డోనాల్డ్ ట్రంప్‌కు ఆ దేశ సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ట్రంప్ అనర్హుడని కోర్టు ప్రకటించింది. 2020లో అధ్యక్ష ఎన్నికల తర్వాత ఆ దేశ పార్లమెంట్ భవనంపై దాడి ట్రంప్ వల్లే జరిగిందని కోర్టు తెలిపింది.
అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి.. డొనాల్డ్ ట్రంప్ ఓడిపోవడానికి ఎన్నికల కమిషన్ కారణమంటూ 2021 జనవరి 6వ తేదీన ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున వాషింగ్టన్‌లో నిరసన చేశారు. ఆ ర్యాలీ సందర్భంగా మద్దతుదారులు యూఎస్ పార్లమెంట్ భవనంపై దాడికి పాల్పడ్డారు. దీంతో ట్రంప్ వల్లే ఇలాంటి హింసాత్మక ఘటన చోటు చేసుకుంది అందుకే అతడ్ని ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఏడు మంది న్యాయమూర్తుల ధర్మాసనం ప్రకటించింది. ఈ తీర్పుపై ఏడుగురు సభ్యులతో కూడిన న్యాయమూర్తుల ధర్మాసనంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో ముగ్గురు జడ్జీలు ఈ తీర్పును వ్యతిరేకించగా.. మిగతా నలుగురు ట్రంప్ నిషేధానికి ఒకే చెప్పారు. మెజారిటీ సభ్యులు ట్రంప్ అనర్హతకు అనుకూలంగా ఉండటంతో ఈ తీర్పును వెల్లడించింది.