Tuesday, November 26, 2024

మాగుంట రాఘవకు చుక్కెదురు.. బెయిల్ తిరస్కరించిన న్యాయస్థానం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న మాగుంట రాఘవ రెడ్డికి గురువారం రౌజ్ అవెన్యూ కోర్టులో చుక్కెదురైంది. మనీ లాండరింగ్ అంశాన్ని దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ రాఘవను అరెస్టు చేయడంతో ఆయన తిహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. బెయిల్ కోసం రౌజ్ అవెన్యూ కోర్టు కాంప్లెక్సులోని స్పెషల్ కోర్టులో దరఖాస్తు చేసుకోగా, వాదోపవాదనల అనంతరం న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది.

ఇదే కేసులో ఈడీ అరెస్టు చేసిన నిందితులెవరికీ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయలేదు. స్పెషల్ కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్‌షీట్లోనూ రాఘవ రెడ్డితో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిపై ఈడీ అనేక అభియోగాలు మోపింది. ఈ పరిస్థితుల్లో కేసు దర్యాప్తుపై ప్రభావం పడకుండా ఉండేందుకు బెయిల్ ఇవ్వకూడదన్న ఈడీ వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement