లిక్కర్ కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రూస్ అవెన్యూ కోర్టు ఆరు రోజుల కస్టడీ విధించింది. దీంతో ఈ నెల 28 వరకు కేజ్రీవాల్‌ను ఈడీ విచారించనుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి విచారణ నిమిత్తం గురువారం కేజ్రీవాల్ నివాసానికి వెళ్లిన ఈడీ అధికారులు రాత్రి వరకు విచారణ జరిపి అరెస్ట్ చేశారు.
కేజ్రీవాల్‌ను శుక్రవారం ఉదయం రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచగా.. కేజ్రీవాల్‌ను విచారణ నిమిత్తం 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది. అయితే ఆరు రోజుల కస్టడీకి మాత్రమే కోర్టు అనుమతించింది. ఈ నెల 28న మధ్యాహ్నం 2 గంటలకు కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.