చదువు కోసమని హైదరాబాద్ కు వచ్చిన ఓ యువ జంట…పక్కగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా నడుస్తున్న ఈ వ్యవహారాన్ని పోలీసులు రట్టు చేశారు. డయానా (24), కాబాంగిలా వారెన్ (24) స్టడీ వీసాపై గతేడాది జనవరిలో హైదరాబాద్ వచ్చారు. అప్పటి నుంచి తార్నాకలో ఉంటున్న వీరు రెండు నెలల క్రితం భార్యభర్తలమని చెప్పి నేరెడ్‌మెట్‌లో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు.. భార్యాభర్తలమని చెప్పి అక్కడ గది అద్దెకు తీసుకున్నారు. మీట్24 యాప్‌లో డయానా రిజిస్టర్ చేసుకుంది. వినియోగదారులను ఇంటికి రావాలంటూ ఆహ్వానించేది. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు మల్కాజిగిరి ఎస్వోటీ, నేరెడ్మెట్ పోలీసులు సంయుక్తంగా ఆ ఇంటిపై దాడులు నిర్వహించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పాస్‌పోర్టులు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీసా గడువు ముగిసినా అక్రమంగా ఉంటున్నట్లు గుర్తించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement