పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు. అయితే, ఈ మధ్య కొందరు తమ పెళ్లిని వెరైటీగా చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో విమానంలోనో, పడవల్లో పెళ్లి చేస్తున్న సందర్భంగాలు వెలుగు చూశాయి. తాజాగా ఇప్పుడు ఓ జంట నీటిలోపల పెళ్లి చేసుకుంది. యూకేలో చోటు చేసుకున్న ఈ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్కూబా డైవింగ్ అంటే ఈ జంటకు చాలా ఇష్టమట. దీంతో ఇంగ్లండలోని బర్మింగ్హామ్ లోని మార్స్టన్ గ్రీన్ లో ఉండే బేర్ గ్రిల్స్ అడ్వెంచర్ సెంటర్ లోని వారు ఈ విధంగా పెళ్లి చేసుకున్నారు. ఐదు సంవత్సరాలుగా కలిసి ఉన్న ఈ జంట.. ఎనిమిది మంది అతిథులు సమక్షంలో ఒక్కటయ్యారు. నీటిలోరంగు రంగుల చేపలు సందడి చేశాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement