ప్రధాని నరేంద్ర మోదీ పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన ఏర్పాట్లను బీజేపీ నేతలు పరిశీలిస్తున్నారు. రామగుండం ఎన్టీపీసీ మైదానంలో ప్రధాని మోడీ బహిరంగ సభ ఏర్పాట్లను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక దేశం రూపురేఖలు మారిపోయాయన్నారు. గతంలో యూరియా, అమోనియా కోసం రాష్ట్రాలు కేంద్రాన్ని ప్రాధేయపడాల్సిన పరిస్థితి ఉండేదని ఆయన గుర్తు చేశారు. మోడీ ప్రధాని అయ్యాక ఎక్కడికక్కడ పలు రాష్ట్రాల్లో యూరియా, అమోనియా ఉత్పత్తి కర్మాగారాలను ఏర్పాటు చేయించారని చెప్పారు. రామగుండం ఆర్ఎఫ్సీఎల్ లో 12 లక్షల టన్నుల యూరియా, 7 లక్షల 25వేల టన్నుల ఈ అమోనియా ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. అంతకుముందు వివేక్ వెంకటస్వామి ఇంట్లో బీజేపీ నేతలు సమావేశమయ్యారు. ఈనెల 12న ప్రధాని మోడీ రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం స్థానికంగా జరిగే బహిరంగ సభలో మోడీ ప్రసంగిస్తారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement