బీజేపీ పాలనలో దేశం అధోగతి పాలైందని, ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు అన్ని వర్గాల ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి విమర్శించారు. నిర్మల్ మండలంలోని న్యూ పోచంపహాడ్ గ్రామంలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా యువకులు ఆందోళన బాట పట్టారని, ఇప్పటికైనా మోదీ మేలుకోవాలని హితవు పలికారు. ప్రధాని మోదీ ఇకనైనా ప్రజా వ్యతిరేక విధానాలను వీడనాడాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓవైపు రాష్ట్రంలో శాంతి భద్రతల కోసం పెద్ద ఎత్తున పోలీసు ఉద్యోగాల నియామకాలు చేస్తున్నదని చెప్పారు. మోడీ సర్కార్ దేశ భద్రతను ఫణంగా పెట్టి అగ్నిపథ్ లాంటి పథకం తెచ్చి సైన్యంలో దొడ్డిదారిన నియామకాలకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. సికింద్రాబాద్ అల్లర్ల వెనుక టీఆర్ఎస్ ఉంటే.. బీహార్, హర్యానా, యూపీలో జరిగిన అల్లర్ల వెనుక ఎవరున్నారో చెప్పాలని బీజేపీ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement