ఆర్ఎస్ఎస్ కబంధ హస్తాల నుంచి దేశాన్ని విముక్తి చేస్తామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్లో ఏర్పాటు చేసిన సభలో రాహుల్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సమూల మార్పులు తీసుకొస్తామన్నారు. కేంద్రంలో బీజేపీ, తెలంగాణలో టీఆర్ఎస్ వల్ల కొద్దిమంది వ్యాపారవేత్తలకే లాభం చేకూరుతుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఫిట్నెస్కోసం జిమ్ చేస్తే సరిపోతుంది, కానీ పాదయాత్ర చేయాల్సిన పనిలేదన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను కేంద్రం నాశనం చేస్తోందన్నారు. రాజకీయం, ఎన్నికల కోసం యాత్ర చేయడం లేదు, దేశ మనుగడ కోసమే మా యాత్ర అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పొత్తు ఉండదన్నారు. విపక్షాల మధ్య ఐక్యత రావాలని తెలిపారు. పాదయాత్ర ద్వారా ఎన్నో తెలుసుకున్నానన్నారు. అనంతరం గుజరాత్లో ప్రమాదంపై రాహుల్ దిగ్భ్రాంతి వ్యక్తం వేసి.. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
Breaking : ఆర్ఎస్ఎస్ కబంధ హస్తాల నుంచి దేశాన్ని విముక్తి చేస్తాం : రాహుల్ గాంధీ
Advertisement
తాజా వార్తలు
Advertisement