అర్పిత ముఖర్జీకి చెందిన బల్గేరియా ఇంటికి పెద్ద పెద్దసంఖ్యలో డూప్లికేట్ తాళాలు ఉన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. అర్పిత లేని సమయంలో ఆ ఇంటికి ఎంతోమంది వచ్చి వెళ్లారని ఈడీ నిర్థారించింది. ముఖర్జీకి సంబంధించిన కేర్ టేకర్, సెక్యూరిటీ సిబ్బంది, ఇతర అపార్టుమెంట్ వాసుల నుంచి ఈ విషయాలను నిర్థారించినట్లు శనివారం ఈడీ అధికారులు వెల్లడించారు. అందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగిందని అధికారులు తెలిపారు. అర్పిత ముఖర్జీ ఇళ్లలో స్వాధీనం చేసుకున్న భారీ నగదుకు సంబంధించి అధికారులు ఆమె నుంచి కీలక సమాధానాలు రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారు. భారీ మొత్తంంలో కోట్లాది రూపాయల నగదు, బంగారాన్ని ఆమె ఒక్కటే ఫ్లాట్స్‌కు తరలించడం, వాటిని భద్రంగా పలు చోట్ల దాచి ఉంచడం అసాధ్యమని ఈడీ భావిస్తోంది. ముఖర్జీకి సంబంధించిన 8 బ్యాంకు ఖాతాలను సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఛటర్జీకి సంబంధించిన సన్నిహిత బంధువులు, స్నేహితుల బ్యాంకుఖాతాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
ముఖర్జీకి చెందిన డైమండ్ సిటీ ఇంట్లో విదేశీ కరెన్సీ, బంగారు ఆభరణాలు, పలు ఆపిల్ ఐ ఫోన్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదును లెక్కించడానికి ఈడీ అధికారులకు ఇరవై నాలుగు గంటల సమయం పట్టింది. ఆ తర్వాత బల్గేరియా నివాసంలో అంతపెద్ద మొత్తంలో నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు ఈడీ అధికారులు అర్పిత ముఖర్జీకి చెందిన ఇళ్ల నుంచి రూ. 27.90 కోట్ల నగదు, 6 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నగదు, బంగారం స్వాధీనం చేసుకున్న నాలుగు ఇళ్లన్నీ అర్పిత పేరు మీదనే రిజిస్టరయి ఉన్నాయని ఈడీ అధికారులు గుర్తించారు. ఎస్‌ఎస్‌సీ స్కామ్‌లో బెంగాల్ మాజీమంత్రి పార్థ ఛటర్జీని, ఆయన సన్నిహితురాలు ఆర్పిత ముఖర్జీని ఈడీ అరెస్టు చేసి విచారిస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.