Friday, November 22, 2024

Mizoram: మిజోరంలో అధికార పార్టీ ఎదురీత‌… మెజార్టీ స్థానాల‌లో విప‌క్ష జోరం పీపుల్స్ పార్టీ పాగా

ఐజ్వాల్‌: ఈశాన్య రాష్ట్రం మిజోరం )లో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల )కు సోమవారం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభించగా తొలుత పోస్టల్‌ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఆ తర్వాత ఈవీఎం ఓట్ల కౌంటింగ్‌ చేపట్టారు.

ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. ప్రతిపక్ష జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ (ZPM) పార్టీ 22 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార మిజో నేషనల్ ఫ్రంట్ 10 చోట్ల ముందంజలో ఉంది. భాజపా, కాంగ్రెస్‌ చెరో స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.

రాష్ట్రంలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలున్నాయి. నవంబరు 7న పోలింగ్‌ నిర్వహించారు. వాస్తవానికి మిగతా నాలుగు రాష్ట్రాలతో పాటు మిజోరం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ కూడా ఆదివారమే (డిసెంబరు 3) జరగాల్సి ఉండగా.. స్థానిక పార్టీ అభ్యర్థన మేరకు నేటికి వాయిదా వేశారు.

చిన్న పార్టీలు.. జయాపజయాలపై పెద్ద ప్రభావం

- Advertisement -

ఈ ఎన్నికల్లో అధికార ఎంఎన్‌ఎఫ్‌, ప్రతిపక్ష జడ్‌పీఎం, కాంగ్రెస్‌.. మొత్తం 40 స్థానాల చొప్పున పోటీ చేశారు. భాజపా 23 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ తొలిసారిగా బరిలోకి దిగింది. ఈ ఫలితాల్లో జేపీఎం పార్టీ క్లీన్‌ స్వీప్‌ చేసే అవకాశాలున్నాయని ఇటీవల కొన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మిజో నేషనల్‌ ఫ్రంట్‌ పార్టీ 26 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ ఎన్నికల్లో జడ్‌పీఎంకు 8, కాంగ్రెస్‌కు 5 స్థానాలు దక్కాయి. భాజపా ఒక చోట విజయం సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement