భోపాల్ – మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బ్యాలెట్ల కౌంటింగ్ వచ్చే ఆదివారం జరగనుంది. ఆరోజు రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ భవితవ్యం తేలనుంది. అయితే ఫలితాలు రాకముందే కొందరు వ్యక్తులు స్ట్రాంగ్‌రూమ్ నుంచి పోస్టల్ ఓట్లను తీసి వాటిని లెక్కించడం వివాదానికి దారి తీసింది.
కాంగ్రెస్ నాయకుడు కమల్ నాథ్ కూడా తన ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియో బాలాఘాట్ నుండి అని చెబుతున్నారు. బాలాఘాట్ కలెక్టర్ డాక్టర్ గిరీష్ కుమార్ మిశ్రా స్ట్రాంగ్ రూమ్ నుంచి తపాలా ఓట్లను వెలికితీసి ట్యాంపరింగ్ చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బాలాఘాట్ కలెక్టర్ గిరీష్ కుమార్ మిశ్రాతో సహా ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ఉద్యోగులను తక్షణమే సస్పెండ్ చేయాలని ఎన్నికల కమిషన్‌ను కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దీనిపై ఎన్నికల కమిషన్ విచారణ ప్రారంభించింది.