Wednesday, November 20, 2024

ISRO: జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌-14 రాకెట్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్…

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ షార్‌ కేంద్రంలోని రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌-14 రాకెట్‌ను ప్రయోగించేందుకు సిద్ధమ‌య్యారు. రేపు సాయంత్రం 5.35 గంటలకు ఈప్ర‌యోగం ప్రారంభం కానుంది. ఇవాళ మధ్యాహ్నం 2.05 గంటల నుంచి 27.30 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌-14 రాకెట్‌ను ప్రయోగించనున్నారు.

ఇక, షార్‌లోని బ్రహ్మప్రకాష్‌ హాలులో గురువారం నాడు మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ (MRR) సమావేశం నిర్వహించిన తర్వాత ప్రయోగ పనులను లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు (ల్యాబ్‌) వారికి అప్పజేప్పింది. కాగా, అనంతరం లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు చైర్మన్‌ ఆర్ముగం రాజరాజన్‌ ఆధ్వర్యంలో మరోసారి ల్యాబ్‌ సమావేశం జరిగింది. ఇది షార్‌ కేంద్రం నుంచి 92వ ప్రయోగం కాగా.. జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 16వ ప్రయోగం పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో క్రయోజనిక్‌ ఇంజిన్లు తయారు చేసుకుని చేస్తున్న 10 వ ప్రయోగం కావడం విశేషం అని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. మొత్తం 2,272 కిలోలు బరువు కలిగిన ఇన్‌శాట్‌-3 డీఎస్‌ ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలో మీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ప్రవేశ పెట్టేలా ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని డిజైన్‌ చేసినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement