హైదరాబాద్, ఆంధ్రప్రభ: టీ-ఎస్ ఎంసెట్ ప్రవేశ పరీక్ష ద్వారా ఫార్మసీ, బయో-టె-క్నాలజీ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే బైపీసీ విద్యార్థులకు కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. బీ ఫార్మసీ, ఫార్మ్ డీ, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్, బయో మెడికల్ ఇంజినీరింగ్, బయో-టె-క్నాలజీ కోర్సుల్లో ఈ కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు పొందొచ్చు. సెప్టెంబర్ 2, 3 తేదీల్లో బైపీసీ విద్యార్థులు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. 4, 5 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన చేయనున్నారు.
4 నుంచి 7వ తేదీ వరకు ఎంసెట్ బైపీసీ అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. 11న బీ ఫార్మసీ, ఫార్మ్ డీ తొలి విడుత సీట్ల కేటాయింపు చేస్తారు. సెప్టెంబర్ 17 నుంచి ఎంసెట్ బైపీసీ తుది విడుత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. 23న ఫార్మా, బయో-టె-క్నాలజీ కోర్సులకు తుది విడుత సీట్లను కేటాయించనున్నారు. సెప్టెంబర్ 24న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల కానున్నట్లు సాంకేతిక విద్యాశాక కమిషనర్ వాకాటి కరుణ ఈమేరకు ఉత్తర్వుల్లో తెలిపారు.