Tuesday, November 19, 2024

Tokyo: ఈ చేప ఖ‌రీదు రూ.6.5 కోట్లు…

టోక్యో – చేప ఖ‌రీదు ఎంత ఉంటుంది అంటే పుల‌స‌లాంటిది అయిదే కిలో ప‌ది వేల వ‌ర‌కూ ప‌ల‌కొచ్చు. అయితే జ‌పాన్ లో ఒక చేప ఏకంగా రూ.6.5 కోట్ల ధ‌ర ప‌లికి అంద‌ర్ని అశ్చ‌ర్య‌ప‌రిచింది.

టోక్యోలోని అతిపెద్ద చేపల మార్కెట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. గత ఏడాదితో పోలిస్తే బ్లూఫిన్ ట్యూనా చేప ధర ఏకంగా మూడున్నర రెట్లకుపైగా పెరిగింది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన చేపగా పేరున్న బ్లూఫిన్‌ ట్యూనా రకానికి చెందినది ఈ చేప. జపాన్‌ రాజధాని టోక్యోలో జరిగిన వార్షిక వేలంలో బ్లూఫిన్‌ ట్యూనా చేప 114.24 మిలియన్‌ యెన్‌ల ధర పలికింది. ఇది 7 లక్షల 88 వేల 471 అమెరికా డాలర్లకు సమానం కాగా భారత కరెన్సీలో ఆరున్నర కోట్లకుపైనే ఉంటుంది.

గత ఏడాదితో పోలిస్తే ఈసారి వేలంలో బ్లూఫిన్‌ ట్యూనా చేప ధర మూడురెట్లు పెరిగినట్టు… నిర్వాహకులు తెలిపారు. ఈ బ్లూఫిన్‌ ట్యూనా చేప బరువు 238 కిలోలు కాగా అమోరి ప్రిఫెక్చర్‌లోని ఓమా అనే ప్రాంతంలో ఈ చేపను పట్టుకున్నట్టు తెలిపారు. ఈ చేప ఒనోడెరాలోని మిచెలిన్ స్టార్డ్ రెస్టారెంట్‌లో కస్టమర్లకు సర్వ్‌ చేస్తారు. ఒక మ‌నిషికి ఈ చేప‌కూర వ‌డ్డించేందుకు జెస్ట్ అయిదు లక్ష‌లు వ‌సూలు చేస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement