క్వారీ ఎండీ పార్థసారథిని ఈడీ కార్యాలయానికి తరలించారు. ఆయనతో పాటు సీఎఫ్ఓ కృష్ణలను మరికొద్దిసేపట్లో విచారించనున్నారు. విదేశాలకు మనీ లాండరింగ్ ద్వారా నిధులు మల్లించారన్న కోణంలో ఈడీ విచారిస్తోంది. 2 వేల కోట్లు ఏ విధంగా దారి మళ్లించారనే దానిపై దృష్టి సారించింది. నిన్న చంచల్‌గూడ జైలు నుండి కస్టడిలోకి తీసుకున్న ఈడీ అధికారులు కార్వీ కేసులో రెండో రోజు విచారించనున్నారు. ఎండీ పార్థసారథితో పాటు సీఎఫ్ఓ కృష్ణ హరిలను కష్టడీకి తీసుకొని ఈడీ విచారిస్తోంది. కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ 2873.82 కోట్ల రూపాయలు మోసాలకు పాల్పడినట్లు ఇప్పటికే ఈడీ గుర్తించింది. కార్వీ గ్రూప్ నుండి 14 షెల్ కంపెనీలకు ఈ నగదు మొత్తం బదిలీ చేసినట్లు నిగ్గుతేల్చింది. ఇప్పటికే 700 కోట్ల రూపాయలు పార్థసారథికి చెందిన షేర్ హోల్డింగ్ ను ఈడీ సీజ్ చేసింది. మిగిలిన 2 వేల కోట్లు ఎక్కడకు తరలించారన్న దానిపై పార్థసారథి, కృష్ణ హరిలను విచారిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..