Tuesday, November 26, 2024

సమాజంలో అవినీతి చీడ, దేశ ఆర్థికవ్యవస్థ కుంటు.. హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు..

సమాజంలో అవినీతి చాలా పెరిగిపోతున్నదని, ఇది ఓ చీడ పురుగు అని, మెళ్లిగా సమాజాన్ని నాశనం చేస్తుందని ఢిల్లి హైకోర్టు అభిప్రాయపడింది. దేశ ఆర్థిక వ్యవస్థపై ఈ అవినీతి ఎంతో ప్రభావం చూపుతున్నదని చెప్పుకొచ్చింది. ఆర్థికంగా ఎదుగుదలకు ఆటంకంగా మారుతున్నదని వివరించింది. దేశ రాజధానిలో 2010 కామన్వెల్త్‌ గేమ్స్‌ (సీడబ్ల్యూజీ) నిర్వాహకుడి రివిజన్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చంద్ర ధారి అవినీతి అనే అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజంలోని బడుగు, బలహీన వర్గాలకు అవినీతి తోడవుతున్నదని, అందుకే పేదరికంతో పాటు అవినీతి నిర్మూలన సాధ్యం కావడం లేదని అభిప్రాయపడ్డారు. సమాజంలో అవినీతిపరమైన బాధలు కేవలం అణగారిన వర్గాలే భరిస్తున్నాయని వివరించారు.

ఓ నిందితుడికి వ్యతిరేకంగా ఉన్న ఓ సాక్ష్యం అతన్ని శిక్షించేందుకు ప్రాథమికంగా సరిపోతుందని కింది స్థాయి కోర్టు గుర్తిస్తే.. అదే సంబంధిత నిందితుడితో విచారణను ఎదుర్కోవాల్సిన అధికార పరిధిని కలిగి ఉంటుందన్నారు. వీకే వర్మ వేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. సీడబ్ల్యూజీ ఆర్గనైజింగ్‌ కమిటీ (ఓసీ), అప్పటి డీజీ వర్మ, పిటిషనర్‌పై క్రిమినల్‌ ప్రొసీడింగ్‌లతో పాటు 2017లో సీబీఐ కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని కోరింది. ఎఫ్‌ఐఆర్‌లోని సమాచారం ప్రకారం.. వర్మ, ఓసీ అధికారులు ప్రీమియర్‌ బ్రాండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (పీబీపీఎల్‌) డైరెక్టర్‌ సురేష్‌ కుమార్‌ సింఘాల్‌.. కాంపాక్ట్‌ డిస్‌ ్క ఇండియా లిమిటెడ్‌ చైర్మన్‌, ఇతరులతో కలిసి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement