Saturday, November 23, 2024

కాంబోడియా సదస్సులో కార్పొరేషన్ సూపరింటెండెంట్

తిరుపతి, (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : వ్యర్ధాల నుండి సంపద సృష్టించడం ఎలా అనే అంశంపై కాంబోడియా దేశంలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో భారత దేశం నుంచి పాల్గొన్న ఏకైక ప్రతినిధిగా తిరుపతి నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ పి.రవి గౌరవాన్ని పొందారు. ఈ సందర్బంగా గురువారం కమిషనర్ అనుపమ అంజలి, అధికారులు అతడిని సత్కరించారు . ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ జపాన్ ప్రభుత్వం కాంబోడియాలో నిర్వహించిన సదస్సులో 35 దేశాల నుండి ప్రతినిధులు పాల్గొన్నారని, భారతదేశం నుండి ముఖ్యంగా తిరుపతి నగరపాలక సంస్థ నుండి తాను ఒక్కడినేనాని తెలిపారు.

ఆ సదస్సులో ఇళ్ల నుంచి చెత్తను సేకరించి వాటిని ఎరువులు, గ్యాస్, సిమెంట్ బ్రిక్స్ తదితరాలుగా ఉపయోగించుకొని సంపదను ఏవిధంగా సృష్టించుకోవచ్చునో వివరిస్తూ తిరుపతి అనుభవాలతో ప్రెజెంటేషన్ ఇచ్చానని రవి తెలిపారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యర్ధాల నుండి సంపద సృష్టించడం యూనిట్ల పనితీరును చూసి అన్ని దేశాల ప్రతినిధులు అభినందించారన్నారు . రవిని అభినందించిన వారిలో తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, రెవెన్యూ అధికారి కె.ఎల్.వర్మ, ఆరోగ్యాధికారి హరికృష్ణ, మేనేజర్ చిట్టిబాబు, పి.ఆర్.ఓ సురేంధర్ రెడ్డి తదితరులు ఉన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement