Saturday, November 23, 2024

TG | అన్నివర్గాలకూ కార్పొరేట్‌ విద్య…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : రంగారెడ్డి జిల్లా కొందుర్గులో శుక్రవారం యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూల్‌ భవనాల పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు… రాష్ట్రంలో విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తున్నామని ప్రకటించారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో, నైపుణ్య శిక్షణతో విద్యార్థుల భవిష్యత్‌కు భరోసా కల్పించే లక్ష్యంతో వినూత్నమైన యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తొలిదశలో 28 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నామని, ఒక్కో స్కూల్‌కోసం 150 ఎకరాలు కేటాయించి, రూ.25 కోట్లతో పనులు చేపడతామని తెలిపారు. తరువాతి దశల్లో రాష్ట్రమంతటా వీటిని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

- Advertisement -

కేసీఆర్ ప్రభుత్వం ఐదువేల పాఠశాలలను మూసివేసింది.

దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్న తెలంగాణాలో గత పాలకులు పదేళ్ళపాటు కనీసం పేదలకు మెరుగైన విద్యను కూడా అందించలేకపోయారని ధ్వజమెత్తారు. అందినకాడికి దోచుకుతిన్న భారాస అధినేత కేసీఆర్‌ది అప్పుల చరిత్ర అని ఎద్దేవా చేశారు.

బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 5 వేలకుపైగా పాఠశాలలను మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మూసేయించారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ సర్కార్ అణగారిన వర్గాలకు విద్యకు దూరం చేసింది. అందుకే ప్రతి పేదవాడికి నాణ్యమైన విద్యను అందించాలని అనుకున్నాం అని తెలిపారు.

రోల్‌మోడల్‌గా మన విద్యావ్యవస్థ

ఆది నుంచీ పేద వర్గాల సంక్షేమమే అజెండాగా పనిచేస్తున్న కాంగ్రెస్‌.. విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. దేశానికే ఆదర్శంగా నిలిచేలా యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ను తీర్చిదిద్దుతామని తెలిపారు.

పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. 25 ఎకరాల విస్తీర్ణంలో స్కూల్‌ నిర్మాణం జరుగుతుందని వెల్లడించారు. ప్రతి స్కూల్‌లో ప్రత్యేకంగా స్పోర్ట్స్‌ గ్రౌండ్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. మొత్తం రూ.5వేల కోట్లతో ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టినట్లు రేవంత్‌ రెడ్డి చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement