Friday, November 22, 2024

ఈ ఏడాది ఇవే అత్యధిక కరోనా కేసులు

గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా కొత్త‌గా 62,714 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఈ ఏడాది ఈ స్థాయిలో కేసులు నమోదు కావ‌డం ఇదే రికార్డు. ఇక మ‌ర‌ణాలు కూడా అదేస్థాయిలో కొన‌సాగుతున్నాయి. చాలా నెల‌ల త‌ర్వాత మ‌ళ్లీ 300 మార్కు దాటేశాయి. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో క‌రోనాకు చికిత్స పొందుతూ దేశ‌వ్యాప్తంగా 312 మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ తెలిపింది. అటు నిన్న 28,739 మంది మాత్ర‌మే డిశ్చార్జి అయ్యారు.

దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన కేసులు: 1,19,71,624
క‌రోనా నుంచి కోలుకున్నవారు: 1,13,23762
యాక్టివ్ కేసులు: 4,86,310
క‌రోనాతో ఇప్ప‌టివ‌రకూ మ‌ర‌ణాలు: 1,61,552
క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న‌వారు: 6,02,69,782

తెలంగాణలోనూ పెరుగుతున్న కేసులు

గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 57,942 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్త 535 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గురువారం రాత్రి 8 గంటల వరకు పరీక్షలు నిర్వహించగా నమోదైన కేసుల వివరాలను వైద్యఆరోగ్య శాఖ అధికారులు ఆదివారం ఉదయం ప్రకటించారు. ఇప్పటివరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,06,339కి చేరింది. అటు తెలంగాణలో శనివారం కరోనా వైరస్ కారణంగా ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,668గా నమోదైంది. శనివారం కరోనా బారి నుంచి 278 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,495 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారిలో 1,979 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా జీహెచ్ఎంసీ పరిధిలో 154 కేసులు నమోదయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement