Tuesday, November 26, 2024

ఏపీలో 9 లక్షలు దాటిన కరోనా కేసులు

ఏపీలో కరోనా సీన్ మారుతోంది. ప్రతిరోజూ 30వేలకు పైగా కరోనా టెస్టులు చేస్తుండగా.. క్రమంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 30,851 కరోనా పరీక్షలు నిర్వహించగా 993 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 198 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 179, కృష్ణా జిల్లాలో 176, విశాఖ జిల్లాలో 169, అనంతపురం జిల్లాలో 49, శ్రీకాకుళం జిల్లాలో 45, కర్నూలు జిల్లాలో 37, నెల్లూరు జిల్లాలో 35, ప్రకాశం జిల్లాలో 30, తూ.గో. జిల్లాలో 29, కడప జిల్లాలో 18, విజయనగరం జిల్లాలో 16 ప.గో. జిల్లాలో 12 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. గత 24 గంటల్లో 480 మంది కరోనా నుంచి కోలుకోగా గుంటూరు, కృష్ణా, విశాఖ జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మరణించారు. ఏపీలో ఇప్పటివరకు 9,00805 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,86,978 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 6,614గా నమోదైంది. కరోనా మరణాల సంఖ్య 7,213గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement