Sunday, November 24, 2024

కరోనా కొత్త వేరియంట్‌.. ఒమిక్రాన్‌ బిఏ 4.6గా గుర్తింపు

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ బీఏ 4.6 వేగంగా వ్యాపిస్తోంది. అమెరికా, బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తోందని యుకె హెల్త్‌ సెక్యూరిటీ ఏజెన్సీ (యుకెహెచ్‌ఎస్‌ఏ) వెల్లడించింది. లండన్‌లో ఆగస్ట్‌ 14 నుంచి ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల్లో 3.3శాతం కొత్త వేరియంట్‌వేనని యుకెహెచ్‌ఎన్‌ఏ ప్రకటించింది. అమెరికాలో ఈ కేసుల నమోదు 9శాతం ఉన్నట్లు ప్రకటించింది. అమెరికా, బ్రిటన్‌లతో పాటు కొత్త వేరియంట్‌ను ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో గుర్తించినట్లు వెల్లడించింది. ఒమిక్రాన్‌ బీఏ 4.6ను మొదటిసారి ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికాలో గుర్తించడం జరిగింది. కొత్త వేరియంట్‌ సైతం ఎక్కువగా 4.4 లక్షణాలను కలిగి ఉందని, వేగంగా వ్యాపించే లక్షణం ఉందని బ్రిటన్‌ సంస్థ ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement