కరోనా వైరస్ గురించి వుహాన్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ఓ పరిశోధకుడు సంచలన విషయాలను వెల్లడించాయి. కరోనా వైరస్‌ను ఓ జీవాయుధంగా చైనా ప్రయోగించినట్లు అతను వెల్లడించాడు. నాలుగు రకాల వైరస్ స్ట్రెయిన్లకు తమకు ఇచ్చి ఏది వేగంగా వ్యాపిస్తుందో కనుగొనమన్నట్లు తెలిపాడు. వుహాన్ ల్యాబ్‌లో పరిశోధకుడిగా చేసిన చావో షావో ఈ విషయాన్ని ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇంటర్నేషనల్ ప్రెస్ అసోసియేషన్‌కు చెందిన జెన్నిఫర్ జెంగ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను ఈ షాకింగ్ అంశాలను తెలిపాడు.
ఇంటర్నేషనల్ ప్రెస్ అసోసియేషన్ సభ్యుడు జెన్నిఫర్‌తో 26 నిముషాల పాటు సాగిన ఈ ఇంటర్వ్యూలో షావో కీలక విషయాలు బహిర్గతం చేశాడు. చావో షావోతో పాటు మరో పరిశోధకుడు షాన్ చావో కూడా వుహాన్ వైరాలజీ ల్యాబ్‌లో పనిచేశారు. తమ బాస్‌లు తమకు నాలుగు రకాల వైరస్‌లు ఇచ్చారని, దాంట్లో ఏ రకమైన వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందో పరీక్షించాలని ఆదేశించినట్లు చెప్పాడు. వీలైనంత మందిని సోకే సామర్థ్యం ఏ వైరస్‌కు ఉందో పరీక్షించినట్లు ఆ పరిశోదకుడు తెలిపాడు. మనుషులతో పాటు ఇతర జీవాలకు ఏ వైరస్ తొందరగా సోకుతుందో టెస్ట్ చేసినట్లు చెప్పాడు.
కరోనా వైరస్‌ను ఓ జీవాయుధంగా చైనా డెవలప్ చేసిందని చావో షావో పేర్కొన్నాడు. 2019లో వుహాన్‌లో జరిగిన మిలిటరీ వరల్డ్ గేమ్స్ సమయంలో తనతో పనిచేసే చాలా మంది మిస్సయ్యారని, వేరే దేశాలకు చెందిన అథ్లెట్లు ఉంటున్న హూటళ్లకు తమను పంపారని, అక్కడి పరిస్థితులను పరిశీలింలేచేందుకు తమను పంపినట్లు సీనియర్లు చెప్పారని, కానీ వాస్తవానికి వైరాలజిస్టులు అవసరం లేని ప్రాంతాలకు పంపి, వైరస్‌ను వ్యాప్తి చేసేందుకు ప్రయత్నించినట్లు చావో షావో ఆరోపించాడు.
జిన్‌జియాంగ్‌లో ఉయిగర్లు ఉంటున్న క్యాంపుల వద్దకు కూడా తమను పంపినట్లు అతను చెప్పాడు. 2020లో జిన్‌జియాంగ్‌లోని ఉయ్‌గర్ల రీ ఎడ్యుకేషన్ శిబిరాలకు తనను పంపారని, త్వరలో విడుదల కాబోతున్నందున వారి ఆరోగ్య పరిస్థితుల్ని పరిశీలించాలని కోరినట్లు చావో షాన్ తెలిపాడు. వాస్తవానికి ఈ పనికి వైరాలజిస్టులు అవసరం లేదు. కానీ వైరస్‌ను వ్యాప్తి చేసేందుకు లేదా వైరస్ ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు తనను పంపినట్లు ఆ తర్వాత అర్ధమైందని చావో షావో వివరించాడు. ఈ మొత్తం అంతుచిక్కని మిస్టరీలో తానొక అణువునేనని పేర్కొన్న షావో, మహమ్మారి విళయానికి ప్రపంచ వ్యాప్తంగా 70 లక్షల మందికిపైగా మరణించారని, అయినా ఈ వైరస్ నేటికీ మిస్టరీగానే ఉండిపోయిందని చెప్పుకొచ్చాడు.