కరోనా వైరస్ ప్రపంచాన్ని ఇంకా గడగడలాడిస్తూనే ఉంది. అయితే భారతదేశంలో కొంచెం పరిస్థితి మెరుగుపడినట్లు తెలుస్తోంది. దేశంలో క్రమంగా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే భారత్ నుంచి దిగుమతి చేసుకున్న గేదె మాంసంలో కరోనా వైరస్ మూలాలు గుర్తించినట్లు కంబోడియా ప్రభుత్వం ప్రకటన చేయడం కలకలం రేపుతోంది. దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో దిగుమతులను కంబోడియా ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది.
ప్రస్తుతం కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో మళ్లీ దిగుమతులకు ఒకే చెప్పింది. భారత్‌లోని ఉన్న వస్తువులు, ఇతరత్రా ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ క్రమంలో భారత్ నుంచి గేదె మాంసం కంటైనర్లలో కంబోడియాకు ఎగుమతి అయ్యాయి. కానీ ఈ మాంసంలో కరోనా మూలాలు ఉన్నట్లు నిర్ధారించడంతో మూడు కంటైనర్లను నిలిపివేసింది. ఓ ప్రైవేటు సంస్థ రవాణా చేసిన అయిదు కంటైనర్లలో మూడింటిని నిలిపివేసినట్లు, ఇందులోని మాంస పదార్థాలను వారం తర్వాత నాశనం చేస్తామని వెల్లడించారు. కంబోడియాలో కూడా కరోనా వైరస్ కేసులు వెలుగు చూస్తున్నాయి. మంగళవారం కొత్తగా 685 కరోనా కేసులు నిర్ధారించారు. 19 మంది చనిపోయారు. 74,386 కేసులున్నాయి. మొత్తం 1,324 మంది కరోనాతో చనిపోయారు. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది.
ఈ వార్త కూడా చదవండి: దేశంలో కొత్తగా 43,654 కరోనా కేసులు