Saturday, November 23, 2024

జపాన్‌లో కరోనా వైరస్‌ విజృంభణ! కొత్తగా 2,00,975 కొత్త కేసులు.. 31,902 మరణాలు

టోక్యో: జపాన్‌లో కరోనా వైరస్‌ పరివర్తన చెందింది. అంటు వ్యాధుల పెరుగుదలకు కారణభూతంగా నిలిచింది. అధికారులు రికార్డుస్థాయిలో 2,00, 975 కొత్త కేసులను నమోదు చేశారు. ఆరోగ్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం జపాన్‌లో కరోనా ఏడో వేవ్‌. బిఎ.5 ఒమ్రికన్‌ సబ్‌ వేరియెంట్‌ ఇప్పటికే 17 దేశాల్లో వ్యాప్తి చెందింది. సోమవారం నాటికి 125.8 మిలియన్ల జనాభా ఉన్న జపాన్‌ దేశంలో 11.39 మిలియన్‌ కేసులు నమోదయ్యాయని 31,902 మరణాలు సంభవించాయని అధికారులు ధృవీకరించారు. ప్రధానమంత్రి పుమియో కిషిడా ప్రజలను అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. లాక్‌డౌన్‌లు తిరిగి ప్రవేశపెట్టడానికి ప్రస్తుతం ఎటువంటి ప్రణాళికలు లేవన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి ప్రయత్నిస్తూనే జపాన్‌ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం తన ప్రథమ కర్తవ్యమని ప్రధాని అన్నారు.

ఊపందుకున్న వ్యాక్సినేషన్లు
ఈ నేపథ్యంలో అధికారులు నాల్గో రౌండ్‌ టీకాల సదుపాయాన్ని వేగవంతం చేస్తున్నారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో ఉన్నవారు వృద్దులకు వైరస్‌ సోకకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. జపాన్‌లో 31 శాతం మంది నాలుగు డోసుల వాక్సినేషన్‌ ప్రక్రియను ముగించారు. 12 నుంచి 40 సంవత్సరాల వయసుగల వారికి దాదాపు 70 శాతం మందికి ఇంకా మూడో డోసు పూర్తి కాలేదు. యువకులకు మూడో షాట్‌ ఇవ్వడానికి ప్రాధాన్యత నిచ్చింది జపాన్‌ ప్రభుత్వం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement