Tuesday, November 26, 2024

ఎమ్మెల్యే క‌ల్వ‌కుంట్ల విద్యాసాగ‌ర్ రావుకి క‌రోనా..

ఈ నెల 25న టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ప్లీనరీ సందర్భంగా ఆ పార్టీ నేతలు హైద‌రాబాద్ కు వచ్చారు. ప్లీనరీకి ఎంపిక చేసిన ప్రతినిధులు హాజరయ్యారు. అయితే ఈ ప్లీనరీలో ఎమ్మెల్యే క‌ల్వ‌కుంట్ల విద్యాసాగ‌ర్ రావు ఎవరెవరిని కలిశారో వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.వివారాల్లోకి వెళ్తే… క‌రోనా మ‌హ‌మ్మారి ఇంకా కోర‌లు చాచుతూనే ఉంది. కాస్త త‌గ్గుముఖం ప‌ట్టినా అక్క‌డ‌క్క‌డ కేసులు వ‌స్తూనే ఉన్నాయి. కాగా రీసెంట్ గా జ‌గిత్యాల జిల్లా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు క‌రోనా బారిన ప‌డ్డారు.

గ‌త రెండు రోజులుగా ఆయన అనారోగ్యంగా ఉండటంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా ఆయనకు కరోనా సోకిందని తేలింది. వైద్యుల సూచనల మేరకు హైద‌రాబాద్ లోని తన ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నారు. టిఆర్ ఎస్ ప్లీన‌రీ సందర్భంగా కలిసిన టీఆర్‌ఎస్‌ నాయకులు కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. విద్యాసాగర్‌రావుకు కరోనా సోకడంతో టీఆర్‌ఎస్ నేతలతో పాటు ఆయన సన్నిహితులు ఆందోళన చెందుతున్నారు.

దేశంలోని పలు రాష్ట్రాల్లో వెలుగు చూస్తున్న కోవిడ్‌ కేసుల్లో కొత్త వేరియంట్‌ ఏవై.4.2(AY.4.2) తీవ్ర భయాందోళనలు కలుగజేస్తుంది. ఈ వేరియంట్‌కు సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. సెకండ్‌ వేవ్‌ సమయంలో ఈ కొత్త వేరియంట్‌ తీవ్ర నష్టం కలిగించిన డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కుటుంబానికి చెందింది. దీని వల్ల కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ వచ్చే అవకాశం అధికంగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, కేరళ, తెలంగాణ, జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రాల్లో ఈ కొత్త వేరియంట్‌ ప్రవేశించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అధికారులు ఈ కొత్త వేరియంట్‌ గురించి పరిశోధిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement