Friday, November 22, 2024

ఏపీకి భారీ సంఖ్యలో చేరుకున్న వ్యాక్సిన్ డోసులు

ఏపీలో రెండ్రోజులుగా కరోనా వ్యాక్సినేషన్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. టీకా నిల్వలు లేకపోవడమే అందుకు కారణం. ఈ నేపథ్యంలో, రాష్ట్రానికి భారీగా కరోనా వ్యాక్సిన్ డోసులు చేరుకున్నాయి. 9 లక్షల కొవిషీల్డ్ డోసులు, 76,140 కొవాగ్జిన్ డోసులు గన్నవరం విమానాశ్రయానికి వచ్చాయి. ఈ వ్యాక్సిన్లను అధికారులను గన్నవరంలోని ప్రధాన వ్యాక్సిన్ స్టోరేజి కేంద్రానికి తరలించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలతో వ్యాక్సిన్ డోసులను జిల్లాలకు తరలించనున్నారు.

మరోవైపు తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగింపుపై అనిశ్చితి నెలకొంది. రాష్ట్రం వద్ద ప్రస్తుతానికి 7.5 లక్షల టీకా డోసులు ఉండగా, కేంద్రం నుంచి తదుపరి కేటాయింపులు రాకపోవడం తెలంగాణ యంత్రాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement