Tuesday, November 26, 2024

సోనియాకు కరోనా.. ఈడీ విచారణకు అడ్డంకి కాదన్న పార్టీ వర్గాలు

న్యూఢిల్లి : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కరోనా సోకింది. స్వల్పంగా జ్వరం, కరోనా లక్షణాలతో బాధపడుతున్న సోనియాగాంధీకి కరోనా పాజిటివ్‌ అని డాక్టర్లు గురువారం నిర్థారించారు. దీంతో సోనియా హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.
సోనియాకు కరోనా సోకినప్పటికీ,నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో మనీల్యాండరింగ్‌ ఆరోపణలపై విచారణ కోసం ఈనెల 8న ఈడీ ఎదుట హాజరయ్యేందుకు కరోనా అడ్డంకి కాదని కాంగ్రెస్‌పార్టీ అధికారప్రతినిధి రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలా ప్రకటించారు.
సోనియాగాంధీ బుధవారం సాయంత్రం నుంచి స్వల్పంగా జ్వరంతో పాటు కరోనా లక్షణాలతో బాధపడుతున్నారని ఆయన వెల్లడించారు. వారంరోజులుగా సోనియాగాంధీ, పార్టీ నేతలు, కార్యకర్తలతో మీటింగ్స్‌ నిర్వహిస్తున్నారని, వారిలో కరోనా పాజిటివ్‌ ఉన్న వ్యక్తుల నుంచి సోనియాగాంధీకి కరోనా సోకి ఉంటుందని సూర్జేవాలా వెల్లడించారు. డాక్టర్లు టెస్టులు నిర్వహించి, ఆమెకు కరోనా పాజిటివ్‌ నిర్థారించారని ఆయన వెల్లడించారు. దీంతో, సోనియా డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని సూర్జేవాలా తెలిపారు. సోనియాతో పాటుపలువురు అగ్రనేతలు, పార్టీ ఇన్‌చార్జ్‌ జనరల్‌ సెక్రటరీ కెసి వేణుగోపాల్‌కు సైతం కరోనా సోకిందని రణదీప్‌ సింగ్‌ సూర్జేవాలా వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement