Friday, November 22, 2024

బీ అలర్ట్… ఆగస్టు నుంచే కరోనా థర్డ్ వేవ్

క‌రోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే ముగుస్తోంది. కరోనా కేసుల సంఖ్య కూడా తాజాగా నాలుగు నెల‌ల క‌నిష్ఠానికి దిగి వ‌చ్చింది. అయితే అప్పుడే మూడో వేవ్ ముప్పు పొంచి ఉంద‌ని ఎస్‌బీఐ తాజా నివేదిక వెల్లడిస్తోంది. ఆగస్టు నెలలోనే కరోనా మూడో వేవ్ ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని త‌న తాజా నివేదిక‌లో హెచ్చ‌రించింది.

‘కోవిడ్‌-19: ద రేస్ టు ఫినిషింగ్ లైన్’ పేరుతో ఎస్‌బీఐ త‌న ప‌రిశోధ‌న నివేదిక‌ను రూపొందించింది. ఇక కొవిడ్ థ‌ర్డ్ వేవ్ పీక్ సెప్టెంబ‌ర్‌లో ఉంటుంద‌నీ ఈ అధ్య‌య‌నం అంచ‌నా వేసింది. భారత్‌లో సెకండ్ వేవ్ పీక్ మే 7న న‌మోదైంద‌ని ఈ నివేదిక వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం డేటా ప్ర‌కారం చూసుకుంటే ఇండియాలో జులై రెండో వారంలో రోజుకు 10 వేల చొప్పున కేసులు న‌మోదు కావ‌చ్చు. అయితే ఆగ‌స్ట్ రెండో ప‌క్షంలో కేసుల సంఖ్య మ‌ళ్లీ భారీగా పెర‌గొచ్చ‌ని ఎస్‌బీఐ నివేదిక అంచ‌నా వేసింది.

ఇది కూడా చదవండి: మూడు నెలల తర్వాత తొలిసారిగా 44వేల దిగువన కరోనా కేసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement