Tuesday, November 19, 2024

బీ అలర్ట్..వచ్చే నెలలో కరోనా థర్డ్ వేవ్..

కరోనా సెకండ్ వేవ్ క్రమంగా మందగిస్తోంది..ఇప్పుడిప్పుడే అన్ని రాష్ట్రాల్లో ఆంక్షల సడలింపులు ఇస్తున్నారు..అయితే అంతలోనే థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని సర్వేలు చెబుతున్నాయి. వచ్చే నెలలో కరోనా థర్డ్ వేవ్ రావచ్చిని చెబుతోంది ఎస్‌బీఐ తాజా స‌ర్వే. ఆగ‌స్ట్‌లోనే ఈ మూడో వేవ్ ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని త‌న తాజా నివేదిక‌లో హెచ్చ‌రించింది. కొవిడ్‌-19: ద రేస్ టు ఫినిషింగ్ లైన్ పేరుతో ఎస్‌బీఐ త‌న ప‌రిశోధ‌న నివేదిక‌ను రూపొందించింది. ఇక కొవిడ్ థ‌ర్డ్ వేవ్ పీక్ సెప్టెంబ‌ర్‌లో ఉంటుంద‌నీ ఈ అధ్య‌య‌నం అంచ‌నా వేసింది. ఇండియాలో సెకండ్ వేవ్ పీక్ మే 7వ తేదీన న‌మోదైంద‌ని ఈ నివేదిక వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం డేటా ప్ర‌కారం చూసుకుంటే ఇండియాలో జులై రెండో వారంలో రోజుకు 10 వేల చొప్పున కేసులు న‌మోదు కావ‌చ్చు. అయితే ఆగ‌స్ట్ రెండో ప‌క్షంలో కేసుల సంఖ్య మ‌ళ్లీ భారీగా పెర‌గొచ్చ‌ని ఎస్‌బీఐ రిపోర్ట్ అంచ‌నా వేసింది.

ఇది కూడా చదవండి: మాన్సాస్‌లో 16 సంవత్సరాల తర్వాత ఆడిట్‌..సర్వత్రా ఆసక్తి

Advertisement

తాజా వార్తలు

Advertisement