Saturday, November 23, 2024

21 మందికి విద్యార్థులకు కరోనా… కానీ రేపే పరీక్ష

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కరోనా కలకలం రేపింది. గత మూడు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన నలుగులు విద్యార్థులకు, ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు నిర్వహించగా వారికి పాజిటివ్ అని తెలడంతో కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళన లకు గురవుతున్నారు. దీంతో వైద్య అధికారులు కళాశాలలోని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, సిబ్బందికి ఈ రోజు కరోనా పరీక్షలు నిర్వహించారు. మొత్తం 146 మందికి పరీక్షలు చేయగా 21 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

అందులో10 మంది ఉపాధ్యాయులకు, వంట మనిషి, వాచ్ మాన్, డ్రైవర్ , 8 మంది విద్యార్థులకు… మొత్తం 21 మందికి వైరస్ నిర్దారణ అయింది .రేపటి నుండి పాలిటెక్నిక్ పరీక్షలు ఉన్న నేపథ్యంలో విద్యార్థులు కళాశాల ముందు బైఠాయించి కరోనా కొంత తగ్గుముఖం పట్టే వరకు పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారని, కరోనా వచ్చాక హడావిడి చేస్తూ టెస్టులు చేపిస్తున్న కళాశాల యాజమాన్యం కరోనా రాకముందు ఎందుకు తగు జాగ్రత్తలు తీసుకోలేకపోయారని ప్రశ్నించారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపల్, ఉపాధ్యాయుల పై ఉన్నతాధికారులు‌ తగు చర్యలు తీసుకోవాలని‌ డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement