1. కరోనా సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా మారిందని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్టర్ రణదీప్ గులేరియా పేర్కొన్నారు. అధిక సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయని, ప్రభుత్వాలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కరోనా కట్టడికి కంటైనర్ జోన్లను ప్రకటించడం, ప్రజలు గుమిగూడటంపై నిషేధం విధించడం, భారీ సంఖ్యలో వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను చేపట్టడం వంటి మూడు దశలను అమలు చేయాలని అన్నారు.
2. ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు కరోనా వేరియంట్స్ ఉన్నప్పటికీ.. భారత్‌లో అన్ని వేరియంట్స్ ఇంకా కనిపించలేదని.. అది కొంత వరకు సంతోషించాల్సిన విషయమని అన్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టాలని, కంటైన్మెంట్ జోన్లను ప్రకటించాలని, అలాగే కరోనా పరీక్షలు, బాధితులను గర్తించడం, వైద్యం అందించడం వంటివి మరింత ఎక్కువగా చేపట్టాలని అన్నారు. రెండవది.. ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. మూడవది.. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు. గతంలో దేశవ్యాప్తంగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను ఏ విధంగా విభజించామో తిరిగి అదే విధంగా జోన్లను విభజించాలని అన్నారు.
3. క్లాత్ తో తయారు చేసిన మాస్కుల కంటే ఎన్-95 లేదా కెఎన్ -95 మాస్కులు వాడటం చాలా మంచిదని అమెరికా మేరీలాండ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఫాహిమ్ యూ నస్ పేర్కొన్నారు. రెండు ఎన్-95 లేదా కెఎన్ -95 మాస్కులు కొని,,, ఒక్కోరోజు ఒక్కోటి వాడాలని సూచించారు. ఒకటి వాడిన తర్వాత దానిని పేపర్ బ్యాగ్ లో ఉంచి మరుసటి రోజు వాడాలని తెలిపారు. అవి పాడు కాకపోతే కొన్ని వారాల పాటు వాడుకోవచ్చని పేర్కొన్నారు. క్లాత్ తో చేసిన మాస్కులు ధరించ వద్దని హెచ్చరించారు..