కరోనా ప్రభావం రోజురోజుకు పెరుగుతూనే ఉంది.. ఒక వైపు ఒమిక్రాన్.. మరో వైపు కరోనా కేసులు విజృంభిస్తున్నాయి.. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో కరోనా కలకలం రేగింది. శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఇద్దరు వైద్యులకు, 12 మంది ఉద్యోగులకు కరోనా సోకింది. కరోనా సోకిన వారి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు పంపించారు. మొత్తం 14 మందికి కరోనా సోకడంతో అంతరిక్షకేంద్రంలో పనిచేస్తున్న మిగతా ఉద్యోగులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనికోసం ప్రత్యేక మార్గదర్శకాలను షార్ అధికారులు విడుదల చేశారు. బయో మెట్రిక్ స్థానంలో అటెండెన్స్ రిజిస్టర్లను ఏర్పాటు చేశారు. ఉద్యోగులు, వైద్యులకు కరోనా సోకడంతో ఈనెల చివరి వారంలో నిర్వహించాల్సిన రీ శాట్ ఉపగ్రహ ప్రయోగం వాయిదా పడే అవకాశముంది. ఒక్కరోజే ఇంత మందికి పాజిటివ్ కేసులు నమోదు కావడం వల్ల అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులంతా కలవరపాటుకు గురయ్యారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital