Wednesday, November 20, 2024

హుజురాబాద్ ఎఫెక్ట్.. కరీంనగర్ జిల్లాపై కరోనా పంజా

తెలంగాణ వ్యాప్తంగా కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టినా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాత్రం కరోనా పాజిటివ్ కేసులు తగ్గడం లేదు. జనసాంద్రత ప్రకారం జీహెచ్ఎంసీతో పోల్చితే కరీంనగర్ జిల్లాలో నమోదయ్యే కేసులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అనధికార కేసులను కూడా కలుపుకుంటే కరోనా కేసులు మరో మూడు రెట్లు అధికంగా ఉంటాయని అధికారులు ఆఫ్ ది రికార్డుగా చెప్తున్నారు.

హుజురాబాద్ ఉపఎన్నిక పేరుతో ఆ నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఎన్నికల ప్రచారం పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతున్నారు. వీరి కారణంగా కరోనా వ్యాప్తి అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత నెల 29 నుంచి ఈనెల 4వ తేదీ వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 190 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. కానీ హుజురాబాద్ నియోజకవర్గంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయని వారు చెప్తున్నారు. తెలంగాణలో థర్డ్ వేవ్ వస్తే అది ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే షురూ అవుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. రాజకీయ పార్టీల నేతలు ఇలాగే వ్యవహరిస్తే మున్ముందు కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని డాక్టర్లు జోస్యం చెప్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement